అంతర్జాతీయ ప్రతికూలతల మధ్య స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 250పాయింట్లకుపైగా తగ్గి 38వేల 880 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 85పాయింట్లకుపైగా నష్టంతో 11వేల 665 వద్ద ట్రేడవుతోంది.
కారణాలు:
* అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు
* రూపాయి పతనం
* ముడి చమురు ధరల పెరుగుదల
నష్టాల్లో...
ఎస్ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.66 శాతం) భారీగా నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏసియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఎస్ అండ్ ఎమ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ సమారు 1.72 శాతం వరకు నష్టాలు చవిచూశాయి.
లాభాల్లో..
టీసీఎస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ సుమారు 1.31 శాతం లాభాలను ఆర్జించాయి.
ఇది సహజమే...
సాధారణ ఎన్నికలకు ముందు గణనీయమైన లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు, ఆ తరువాత తాత్కాలికంగా కొంత నష్టాలు చవిచూడడం సహజమేనని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వృద్ధిలో మందగింపు, అధిక ఇంధన ధరలు , బలహీనమవుతున్న కరెన్సీ విలువ మొదలైన అంశాలు ప్రభావం చూపుతాయని వివరించారు.
పెరిగిన ముడిచమురు ధరలు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 2.06 శాతం పెరిగాయి. బ్యారెల్ ధర 73.84 డాలర్లు.
క్షీణించిన రూపాయి విలువ
అమెరికా డాలర్లో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు క్షీణించి రూ.69.84కు చేరుకుంది.
ఇదీ చూడండి: ఏదేమైనా జెట్‌ను మూతపడనివ్వం: జెట్ ఉద్యోగులు