Nude Video to MLA in Telangana : వీడియో కాల్ చేసి, అందులో నగ్నంగా కనిపించి, ఆ స్క్రీన్ షాట్లు తీసుకుని బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటివి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఇలాంటి వీడియో కాల్స్‌తో ఎంతోమందిని సైబర్ కేటుగాళ్లు నిలువెల్లా దోచుకుంటున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ నెల 14న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వీడియో కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన ఆ వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. ఆ వెంటనే ఫోన్ స్క్రీన్‌పై మహిళ నగ్నంగా కనిపించింది.
సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో కేసు నమోదు : ఊహించని పరిణామంతో ఆందోళనకు గురైన ఎమ్మెల్యే వెంటనే వీడియో కాల్‌ను కట్ చేశారు. అయితే తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా న్యూడ్ వీడియో కాల్ చేశారా? లేదా నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులే ఇలా చేసి ఉంటారా అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. ఇలా వీడియో కాల్ చేసి తన ప్రతిష్ఠను దిగజార్చడంతో పాటు బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే అనుమానంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ)లోనూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్ నంబర్ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
మోసాలు ఎన్నో రకాలు : ఎన్నో రకాలుగా మోసం చేయడానికి కేటుగాళ్లు వెనకాడడం లేదు. ఫేక్ కాల్స్ చేస్తూ లేదా వీడియో కాల్స్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ, మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారంటూ భయాందోళనకు గురి చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇటీవల ఓ మహిళకు సైబర్ నేరస్థులు వీడియో కాల్ చేసి తాము సీబీఐ పోలీసులు అని, మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్ కేసులో ‘నాన్-బెయిల్ వారెంట్’పై అరెస్టు చేశామని నమ్మించారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మొదట ఇదంతా నమ్మిన ఆ మహిళ వారి వ్యవహార శైలిపై అనుమానం వచ్చి వెంటనే తన భర్తకు కాల్ చేయగా మోసమని గ్రహించింది. మోసం చేయడానికి ఇదో రకమైన వీడియో కాల్ అయితే మరో రకంగా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ కూడా బెదిరింపులకు పాల్పడి భారీగా దోచుకుంటున్నారు.
Nude Video Calls : నగ్నంగా వీడియోకాల్ చేయమంటారు.. నగదంతా దోచేస్తారు
రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఆర్మీ కాంట్రాక్ట్, న్యూడ్ వీడియోలతో దోచేశారు..