ETV Bharat / business

పండగ ముందు నష్టాలు- 60వేల దిగువకు సెన్సెక్స్ - ఎన్​ఎస్​ఈ నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్దకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ 60 పాయింట్లు దిగజారింది.

stock market live
స్టాక్​ మార్కెట్
author img

By

Published : Nov 3, 2021, 3:51 PM IST

స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 60 పాయింట్ల నష్టంతో 17,829 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

60,275 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​ 60,361 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే ఒడుదొడుకులు కొనసాగడం వల్ల 59,552 కనిష్ఠానికి చేరుకుంది. మార్కెట్​ ముగిసే సమయానికి 257 పాయింట్ల నష్టంతో 59,772 వద్ద ముగిసింది.

నిఫ్టీ 17,947 వద్ద ప్రారంభమై.. 17,757 వద్ద కనిష్ఠాన్ని తాకింది. వెంటనే పుంజుకుని 17,988 గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 17,829 వద్ద ముగిసింది.

ఆటోమొబైల్​, బ్యాంకింగ్, ఫార్మా​ రంగాలు మార్కెట్​ నష్టాలపై ప్రభావం చూపించాయి.

లాభనష్టాలు..

  • ఎల్​టీ, గ్రాసిమ్​, ఏషియన్​ పెయింట్స్, యూపీఎల్​, హిందాల్​కో షేర్లు లాభాలను గడించాయి.
  • సన్​ఫార్మా, ఇండస్​బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, కొటక్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి : పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునేందుకున్న 4 మార్గాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.