స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 380 పాయింట్లు పెరిగి 51,017 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 15,301 వద్దకు చేరింది.
ఐటీ, ఆటో షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా ఆందోళనలు కొనసాగుతున్నా ఈ స్థాయిలో లాభాలు నమోదు కావడం విశేషం.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 51,072 పాయింట్ల అత్యధిక స్థాయి, 50,620 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,319 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,194 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎం&ఎం, మారుతీ, హెచ్డీఎఫ్సీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై, నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు లాభాలను గడించాయి. కోస్పీ నష్టాలను నమోదు చేసింది.
ఇదీ చదవండి:'ఏటా 200 కోట్ల డోసుల తయారీకి సిద్ధం'