కరోనా సంక్షోభ సమయంలో సామాన్యులకు కాస్త ఊరటనిచ్చేలా కీలక చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంకు. టెర్మ్ లోన్స్ నెలవారీ వాయిదాల చెల్లింపుపై 3 నెలల మారటోరియం విధించేందుకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చింది. వర్కింగ్ కేపిటల్‌పై వడ్డీ చెల్లింపు ఆలస్యమైనా రుణ ఎగవేతగా పరిగణించరాదని సూచించింది. చెల్లింపుల్లో జాప్యం.. రుణగ్రహీత క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపదని స్పష్టంచేసింది.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఈ మేరకు ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకుంటున్న మరిన్ని చర్యల్ని వెల్లడించారు.
ఆందోళన వద్దు...
భారత్‌లో బ్యాంకింగ్ వ్యవస్థ భద్రంగా ఉందని భరోసా ఇచ్చారు శక్తికాంత దాస్. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ప్రజల డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. అనవసరంగా ఆందోళన చెంది, ప్రజలు ఒక్కసారిగా నగదు విత్‌డ్రా చేయొద్దని కోరారు.
ఇదీ చదవండి..