ETV Bharat / business

ఈక్విటీ మార్కెట్​లో ఈ ఏడాది పట్టిందల్లా డబ్బే!

2020లో ఈక్విటీల ద్వారా రూ.1.78 లక్షల కోట్ల మేర నిధుల సమీకరణ జరిగింది. 2019తో పోలిస్తే 116% వృద్ధి నమోదైంది. పబ్లిక్‌ ఇష్యూల జోరు, చిన్న మదుపర్ల ప్రాతినిథ్యం పెరగడం వల్ల ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణ ఇదే కావడం విశేషం.

equity market fundraising in 2020
ఈక్విటీ మార్కెట్​లో ఈ ఏడాది పట్టిందల్లా డబ్బే!
author img

By

Published : Dec 29, 2020, 7:10 AM IST

కేపిటల్‌ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణపై కరోనా ప్రభావం కనపడకుండా పోయింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ల ద్వారా గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నిధుల సమీకరణ జరగడమే ఇందుకు నిదర్శనం. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓలు), మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓలు), ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌), ఇతర ఇష్యూల ద్వారా మొత్తంగా రూ.1,77,468 కోట్లను కంపెనీలు సమీకరించాయని ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 2019లో ఈ విధంగా సమీకరించిన రూ.82,241 కోట్లతో పోలిస్తే ఈ విలువ 116 శాతం ఎక్కువ. ఐపీఓల్లో చిన్న మదుపర్లు పాల్గొనడం పెరగడం ఇందుకు ఓ కారణం కాగా.. క్యూఐపీలు, ఇన్విట్‌/ రీట్స్‌లకు విశేష ఆదరణ లభించడం మరో కారణమని ప్రైమ్‌ డేటాబేస్‌ తెలిపింది.

equity market fundraising in 2020
నిధుల సమీకరణ వివరాలు

2017 రికార్డు బద్దలు..

ఈక్విటీ మార్కెట్లకు సంబంధించి 2017లో నమోదైన రూ.1,60,032 కోట్లే ఇప్పటివరకు ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణగా ఉంది. ఇప్పుడు రూ.1,77,468 కోట్ల సమీకరణతో ఆ రికార్డును 2020 బద్దలు కొట్టింది.

బాండ్ల ద్వారా రూ.7,475 కోట్లు

ఈక్విటీ ద్వారా సమీకరించిన రూ.1,77,468 కోట్లకు, బాండ్ల రూపేణా వచ్చిన రూ.7,485 కోట్లు కలిపితే 2020లో మొత్తం నిధుల సమీకరణ రూ.1,84,953 కోట్లకు చేరుతుంది. బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను కలిపితే 2019లో మొత్తం నిధుల సమీకరణ రూ.1,00,878 కోట్లు కాగా.. 2018లో రూ.93,352 కోట్లు.

ఐపీఓల్లో 2017దే హవా...

2020లో ఐపీఓల ద్వారా రూ.26,770 కోట్లను కంపెనీలు సమీకరించాయి. 2019లో ఇలా సమీకరించిన రూ.12,985 కోట్లతో పోలిస్తే ఈ విలువ 40 శాతం ఎక్కువ. 2018లో ఐపీఓల ద్వారా రూ.33,246 కోట్లు రాగా.. ఐపీఓలకు అత్యుత్తమ సంవత్సరంగా నిలిచిన 2017లో పబ్లిక్‌ ఇష్యూలు రూ.68,827 కోట్లు తెచ్చిపెట్టాయి.

టాప్‌ లేపిన ఎస్‌బీఐ కార్డ్స్‌

2020లో అత్యధికంగా నిధులు సమీకరించిన పబ్లిక్‌ ఇష్యూ ఎస్‌బీఐ కార్డ్స్‌దే. ఈ కంపెనీ ఐపీఓ రూ.10,341 కోట్ల సమీకరించింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే గ్లాండ్‌ఫార్మా రూ.6480 కోట్లు సమీకరించి, రెండో స్థానంలో నిలిచింది.

4 రోజులు.. రూ.8.22 లక్షల కోట్లు

గత సోమవారం డీలాపడినట్లు కనిపించిన మార్కెట్‌.. ఆ తర్వాత 4 రోజుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కొత్త జీవనకాల గరిష్ఠాలను చేరడమే కాకుండా, మధ్య, చిన్న తరహా షేర్లు కూడా జోరు కనబర్చడంతో మదుపర్లపై లాభాల వాన కురిసింది. మదుపర్ల సంపద గత 4 నాలుగు సెషన్లలో ఏకంగా రూ.8.22 లక్షల కోట్లు పెరగడమే ఇందుకు నిదర్శనం. సోమవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.187.02 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా విదేశీ మదుపర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం కూడా కలిసొస్తోంది.

ఇదీ చదవండి: ట్రంప్ సంతకంతో స్టాక్ మార్కెట్ల రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.