ETV Bharat / business

ఐటీ, విద్యుత్​ షేర్ల దూకుడు- సెన్సెక్స్​ 767 ప్లస్

బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్​ 767పాయింట్లు వృద్ధి చెంది 60,687 వద్ద ముగిసింది. నిఫ్టీ 229పాయింట్లు లాభపడి 18,103 వద్ద స్థిరపడింది.

stock market today
ఐటీ, విద్యుత్​ షేర్ల దూకుడు- మార్కెట్లకు భారీ లాభాలు
author img

By

Published : Nov 12, 2021, 3:39 PM IST

వరుస నష్టాలకు చెక్​ పెడుతూ దేశీయ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 767పాయింట్లు లాభపడి 60,687 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 229పాయింట్లు వృద్ధి చెంది 18,103కు చేరింది.

ఐటీ, రియాల్టీ, విద్యుత్​ రంగ షేర్లు దూసుకెళ్లడం వల్ల నిఫ్టీ.. 18వేల మార్కును తిరిగి అందుకోగలిగింది.

ఇంట్రాడే సాగిందిలా...

అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​, నిఫ్టీ.. కొద్దిసేపు నష్టాల్లో ట్రేడ్​ అయ్యాయి. ఆ వెంటనే బలంగా పుంజుకున్నాయి.

60,248 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్​.. 59,997 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత బలపడి, మొత్తం మీద 767పాయింట్ల లాభంతో 60,687 వద్ద ముగిసింది.

17,977 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. 17,905 కనిష్ఠానికి చేరి అక్కడి నుంచి బలపడింది. చివరకు 229 పాయింట్లు వృద్ధి చెంది 18,103 వద్ద స్థిరపడింది.

లాభనష్టాలు...

  • టెక్​ఎమ్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​, రిలయన్స్​ షేర్లు లాభాలు గడించాయి.
  • బజాజ్​ ఆటో, టాటాస్టీల్​, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

సోమవారం లాభాలు గడించిన దేశీయ సూచీలు.. వరుసగా మూడు రోజులు నష్టపోయాయి. శుక్రవారం లాభాలతో వారాన్ని ముగించాయి.

ఇదీ చూడండి:- దేశ ఆర్థికానికి బలమైన బ్యాంకింగ్​ వ్యవస్థ కీలకం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.