దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ భారీ లాభాలు నమోదు చేసింది. సంవత్ 2078 తొలిరోజు గంట పాటు నిర్వహించిన ట్రేడింగ్లో సూచీలు రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్ ప్రారంభానికి ముందు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలీవుడ్ ప్రముఖ నటి భాగ్యశ్రీ ప్రత్యేక అతిథిగా హాజరై.. గంటకొట్టి ట్రేడింగ్ ప్రారంభించారు.