ETV Bharat / business

కరోనా కేసులు, వ్యాక్సిన్​ వార్తలే మార్కెట్లకు కీలకం! - షేర్ మార్కెట్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్లను ఈ వారం కరోనా వార్తలు, వ్యాక్సినేషన్ అప్​డేట్స్ ముందుకు నడిపించనున్నాయి. అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్లకు కీలకంగా మారనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Stocks market updates
స్టాక్ మార్కెట్ అంచనాలు
author img

By

Published : May 23, 2021, 12:22 PM IST

కార్పొరేట్​ సంస్థల త్రైమాసిక ఫలితాల ప్రకటన దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా సంబంధిత వార్తలు, అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.

దేశంలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుండటం, కొత్త వ్యాక్సిన్​లు మార్కెట్లోకి వస్తుండటం వంటివి మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచే అంశాలని చెబుతున్నారు నిపుణులు. అయినప్పటికీ రోజువారీ కరోనా కేసులపై మదుపరులు అధికంగా దృష్టిసారించొచ్చంటున్నారు. అయితే ఈ వారమే డెరివేటివ్​ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఒడుదొడుకులకు అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు.

'అంతర్జాతీయ పరిణామాల వల్ల బ్యాంకింగ్, ఆర్థిక షేర్లు కాస్త రికవరీ అవుతున్నాయి. ఇతర రంగాలు కూడా లాభాల్లోకి రావాల్సి ఉంద'ని రెలిగేర్ బ్రోకింగ్ ఉపాధ్యక్షుడు అజిత్​ మిశ్రా పేర్కొన్నారు.

బీపీసీఎల్​, సన్​ ఫార్మా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ఇతర సంస్థలు ఈ వారమే 2020-21 క్యూ4, వార్షిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం ఆయా సంస్థల షేర్లపై ప్రధానంగా ఉండనుంది.

వీటన్నింటితో పాటు రూపాయి మారకం విలువ, విదేశీ పెట్టుబడుల ట్రెండ్​, ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:మళ్లీ పెట్రో బాదుడు- ఈ నెలలో పన్నెండోసారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.