అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్థిక, ఆటో, ఫార్మా షేర్లు ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించాయి. హెవీ వెయిట్ షేర్లు కూడా లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 834 పాయింట్లు బలపడి 49,398 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 14,521 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,499 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,805 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,546 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,350 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, ఎల్&టీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ షేర్లు అధికంగా లాభాలను ఆర్జించాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో ఐటీసీ, టెక్ మహేంద్ర, ఎం&ఎం మాత్రమే నష్టాలను నమోదు చేశాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలతో ముగిశాయి.