ETV Bharat / business

ఆరంభ లాభాలు ఉఫ్​- సెన్సెక్స్ 585 పాయింట్లు డౌన్​ - బీఎస్ఈ సూచీ

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. మొదట లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. సెషన్​ ముగిసే నాటికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 585 పాయింట్లు పతనమై 49,217 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 163 పాయింట్లు కోల్పోయింది.

Market LIVE Updates: Sensex tumbles 700 pts, Nifty around 14,500 amid bond yields spike
ఐదోరోజూ నష్టాల్లోనే స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్ 585పాయింట్లు డౌన్​
author img

By

Published : Mar 18, 2021, 3:42 PM IST

వరుస నష్టాలకు బ్రేకులు వేస్తూ లాభాలతో ఆరంభమైన స్టాక్​ మార్కెట్లు.. చివరకు ఐదోరోజూ నష్టాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజీ సూచీ- సెన్సెక్స్​ 585 పాయింట్లు తగ్గి 49,217 వద్ద స్థిరపడింది. నేషనల్​ స్టాక్​ ఎక్సేంజీ సూచీ- నిఫ్టీ 163 పాయింట్లు కోల్పోయి 14 వేల 556 వద్ద ముగిసింది. బ్యాకింగ్​, ఫార్మా రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,296 పాయింట్ల అత్యధిక స్థాయిని; 48,962 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,875 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,479 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభాల్లో ఉన్న షేర్లు..

ఐటీసీ, బజాజ్​ ఆటో, భారతీ ఎయిర్​టెల్, ఎం & ఎం, బజాజ్​ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో నమోదు చేశాయి.

నష్టాల్లో ఉన్నవి..

హెచ్​సీఎల్​ టెక్, ఇన్ఫోసిస్, డా.రెడ్డీస్​,​ టీసీఎస్​, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఇతర ప్రధాన కంపెనీల షేర్లన్నీ దాదాపు నష్టాల్లో కొనసాగాయి.

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం వల్ల మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారని నిపుణులు విశ్లేషించారు.

ఇదీ చదవండి: ఫెడ్​ నిర్ణయాలు, ఆర్థిక గణాంకాలే మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.