14,800 సమీపంలో నిఫ్టీ..
వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 458 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 50,256 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 142 పాయింట్లకుపైగా పెరిగి జీవనకాల గరిష్ఠమైన 14,790 వద్దకు చేరింది.
బడ్జెటోత్సాహం, అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.
- ఐటీసీ, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.