వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా లాభపడి.. 51,437 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 193 పాయింట్లకుపైగా పెరిగి15,119 వద్దకు చేరింది.
అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఆటో షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్,ఎం&ఎం, ఓఎన్జీసీ, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి.
ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎం&ఎం, అదానీ ఎంట్రప్రైజెస్ షేర్లు జీవన కాల గరిష్ఠాలను తాకాయి.