లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 170 పాయింట్ల నష్టంతో 54,380 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ (Nifty today) 48 పాయింట్లు కోల్పోయి 16,230 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాలతో పాటు మదుపరులు లాభార్జనకు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో టాటా స్టీల్ టాప్‌లో కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో చివరి స్థానంలో ఉంది.