బ్యాంకింగ్, ఇంధన రంగ షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 37,736 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 101 పాయింట్ల క్షీణించి 11,102 పాయింట్లకు పడిపోయింది.
అమ్మకాల ఒత్తిడితో..
అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్లు ఉదయం లాభాల బాటపట్టాయి. ఐటీ షేర్ల దూకుడు కూడా సూచీలకు కలిసి వచ్చింది. అయితే బ్యాంకింగ్, ఇంధన, లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడితో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి.
లాభనష్టాల్లో..
సన్‌ఫార్మా, మారుతి, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టైటాన్ లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఓఎన్జీసీ నష్టపోయాయి.