ETV Bharat / business

ఆర్థిక గణాంకాలు, తొలి త్రైమాసిక ఫలితాలే కీలకం! - టీసీఎస్​ ఫలితాల ప్రకటన ఎప్పుడు

ఈ వారం స్టాక్ మార్కెట్లకు కరోనా వార్తలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు తగ్గుతుండటం మార్కెట్లకు కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు. ఈ వారం లార్జ్​, మిడ్​ క్యాప్​ ఐటీ షేర్లపై మదుపరులు దృష్టి సారించే వీలుందని చెబుతున్నారు.

Key issues to stock for this week
ఈ వారం స్టాక్​ మార్కెట్లకు కీలకమైన అంశాలు
author img

By

Published : Jul 4, 2021, 2:52 PM IST

స్థూల ఆర్థిక గణాంకాలు, 2021-22 తొలి త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కూడా మదుపరులు దృష్టి సారించే వీలుందని అంటున్నారు.

అంతర్జాతీయంగా కొవిడ్​ కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతుండటం వంటి పరిణామాలు మార్కెట్లకు సానుకూల అంశాలని జియోజిత్​ ఫినాన్షియల్​ సర్వీసెస్​ పరిశోధనా విభాగాధిపతి వినోద్​ నాయర్​ పేర్కొన్నారు. ఈ వారమే విడుదలవనున్న సేవా రంగ పీఎంఐ లెక్కలు మార్కెట్​ సెంటిమెంట్​ను ప్రభావితం చేయొచ్చని తెలిపారు.

దేశీయ టెక్​ దిగ్గజం టీసీఎస్​ ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో లార్జ్​, మిడ్ క్యాప్​ ఐటీ షేర్లపై మదుపరులు అధికంగా దృష్టి సారించొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వీటన్నింటితో పాటు.. ముడి చమురు ధరలు, రూపాయి హెచ్చుతగ్గులు కూడా మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:Instagram: 'స్టోరీస్​' చేసేయ్​.. డబ్బులు సంపాదించేయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.