ETV Bharat / business

మార్చిలో ఎల్​ఐసీ ఐపీఓ.. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం

LIC Public Issue: ఎప్పటి నుంచో మార్కెట్ వర్గాలు ఎదురు చూస్తున్న ఎల్ఐసీ ఐపీఓకు సంబంధించి కీలక అప్​డేట్​ వచ్చింది. పబ్లిక్​ ఇష్యు కోసం మార్కెట్​ నియంత్రణ సంస్థ (సెబీ) నిర్ధేశించిన పత్రాలను సిద్ధం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వీటిని ఫిబ్రవరి మొదటి వారంలో సెబీ కి అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

lic listing being fast tracked says dipam secretary
మార్చిలో ఎల్​ఐసీ ఐపీఓ
author img

By

Published : Jan 30, 2022, 4:55 AM IST

LIC Public Issue: భారతీయ జీవిత బీమా సంస్థ పబ్లిక్‌ ఇష్యూ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్కెట్‌ నియంత్రణా సంస్థ (సెబీ) అనుమతి కోసం సమర్పించాల్సిన ప్రాథమిక పత్రాల రూపకల్పనలో నిమగ్నమైనట్లు 'పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ' విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే శనివారం తెలిపారు.

ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి సమర్పించబోయే ఈ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్తపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సెబీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఒకసారి పత్రాలు అందజేసిన తర్వాత సెబీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఐపీఓ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎల్‌ఐసీ భారీ ఐపీఓ మార్చి ప్రారంభంలో ఉండే అవకాశం ఉందని తుహిన్‌ కాంత పాండే ఇటీవల తెలిపారు. భారత్‌లో అతిపెద్ద ఐపీఓగా ఎల్‌ఐసీ చరిత్ర సృష్టించనుంది. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు దేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓ అయిన పేటీఎం సమీకరించిన రూ.18,300 కోట్లకు ఇది అయిదు రెట్లు అధికం కావడం గమనార్హం. 2021లో భారీ ఎత్తున ఐపీఓలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఏడాది సగటున ఐపీఓల అనుమతికి సెబీ 77 రోజులు తీసుకుంది. మాక్రోటెక్‌ డెవలపర్స్‌, సెవెన్‌ ఐలాండ్స్‌ షిప్పింగ్‌ వంటి సంస్థలైతే 35 రోజుల్లోనే అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకు సైతం గరిష్ఠంగా 35-40 రోజులు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది. మరోవైపు ఐపీఓ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనుంది. ఐపీఓలో పాల్గొనాలనుకునే పాలసీదార్లు పాన్‌ను అప్‌డేట్‌ చేయాలని కోరింది. షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ కోసం డీమాట్‌ ఖాతాను సైతం కలిగి ఉండాలని గుర్తుచేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Budget 2022: కొవిడ్‌ అస్థిరతకు బడ్జెట్‌ మాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.