ఈ వారం స్టాక్ మార్కెట్లో.. దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాలు కీలకంకానున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాల ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి.
ఐటీ ఫలితాలు..
ప్రముఖ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర సంస్థలైన మైండ్‌ట్రీ, టాటా ఎలెక్సి, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఈ వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్, టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారంలోనే విడుదలకానున్నాయి. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెల్టా రకం కరోనా వేరియంట్ విజృభిస్తున్నట్టు వస్తున్న వార్తలతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై మదుపర్లు దృష్టిసారించవచ్చని విశ్లేషిస్తున్నారు.
వీటన్నింటితో పాటు.. ముడి చమురు ధరలు, రూపాయి హెచ్చుతగ్గులు, కూడా మార్కెట్లపై ప్రభావం చూపే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇదీ చూడండి:- పుంజుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. కానీ!