ETV Bharat / business

Stock Market: ద్రవ్యోల్బణం లెక్కలే మార్కెట్లకు కీలకం! - షేర్ మార్కెట్ ఔట్​లుక్

స్టాక్ మార్కెట్లకు (Stock market) ఈ వారం ద్రవ్యోల్బణం లెక్కలు, అంతర్జాతీయ పరిణామాలు దిశా నిర్దేశం (Market Outlook) చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి సూచీలు ఈ వారం కొత్త గరిష్ఠాల వద్ద స్థిరంగా ఉంటాయా? ఒడుదొడుకులకు అవకాశాలు ఉన్నాయా?

Stock Market Updates
స్టాక్ మార్కెట్​ అప్​డేట్స్​
author img

By

Published : Sep 12, 2021, 12:34 PM IST

ద్రవ్యోల్బణం లెక్కలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను (Stock market) ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి మార్కెట్​ సెంటిమెంట్ పాజిటివ్​గా (Market Outlook) ఉందని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తుండటం.. ఇందుకు కారణమని అంటున్నారు. అయితే సూచీలు రికార్డు స్థాయిలకు చేరినప్పుడు లాభాల స్వీకరణ వల్ల కొంత ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే ఈ వారం.. చైనా పారిశ్రామికోత్పత్తి, అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు.. దేశీయంగా ఆగస్టు నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) లెక్కలు విడుదల కానున్నాయి. ఇవన్నీ మార్కెట్లను ప్రభావితం చేయొచ్చని స్వస్తిక్ ఇన్వెస్ట్​మార్ట్​ లిమిటెడ్ పరిశోధనా విభాగాధిపతి సంతోశ్​ మీనా పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta Variant) విజృంభణ వల్ల ఆర్థిక వృద్ధిపై ఇంకా భయాలు కొనసాగుతున్నాయన్నారు సిద్ధార్థ్ ఖింకా (మోతీలాల్​ ఓశ్వాల్​ ఫినాన్సియల్​ సర్వీసెస్​ రీసెర్చ్ విభాగాధిపతి). ఇది మార్కెట్లను ప్రభావితం చేసే ప్రతికూల అంశమని వివరించారు.

వీటన్నింటితో పాటు.. ముడి చమురు ధరలు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు, రూపాయి హెచ్చుతగ్గులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: ఆహార వ్యర్థాలే ఈ అంకుర సంస్థకు పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.