ETV Bharat / business

ఆసాంతం ఊగిసలాట.. చివరకు నష్టాలు

సోమవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 124 పాయింట్ల నష్టంతో 53 వేల మార్కును కోల్పోయింది. నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 15,824 వద్దకు చేరింది.

Indices
నష్టాల్లో మార్కెట్లు
author img

By

Published : Jul 26, 2021, 3:36 PM IST

స్టాక్​ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 124 పాయింట్లు కోల్పోయి 52,852 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 15,824 వద్ద స్థిరపడింది. మార్కెట్​ తొలుత నష్టాలతో ప్రారంభమైంది. అనంతరం లాభాల బాట పట్టినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో చివరి వరకు ఊగిసలాటలో కొనసాగాయి.

హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు ప్రధానంగా నష్టాలకు కారణం కాగా.. మరోవైపు అంతర్జాతీయ మిశ్రమ పవనాలు కూడా తోడయ్యాయి. దీంతో ఆ ప్రభావం సూచీలపై పడింది. మొదటి త్రైమాసిక ఫలితాలతో రిలయన్స్​ షేర్లు డీలా పడగా.. ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు లాభాలతో ముగించాయి. జొమాటో ర్యాలీ ఈ సెషన్​లో కూడా కొనసాగింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 53,103 పాయింట్ల అత్యధిక స్థాయిని, 52,784 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 15,893 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,797 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి షేర్లు..

బజాజ్​ ఫిన్​సర్వ్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, టైటాన్​, సన్​ఫార్మా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ టెక్​, ఎన్​టీపీసీ షేర్లు లాభాలను గడించాయి.

మహీంద్ర అండ్​ మహీంద్ర, ఎస్​బీఐ, రిలయన్స్​, భారతీ ఎయిర్​ టెల్​,హెచ్​డీఎఫ్​సీ, టెక్ మహీంద్ర షేర్లు నష్టాలను చవిచూశాయి.

ఇదీ చూడండి: ఐటీలో ఫ్రెషర్స్​కి​ భారీ ఆఫర్లు- ప్యాకేజీలు ఎంతంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.