ETV Bharat / business

వృద్ధి లెక్కలకు ముందు మార్కెట్లు డీలా - Indices flat amid volatility ahead of GDP data

జీడీపీ రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలబాటలో పయనించాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు కోల్పోగా... నిఫ్టీ 18 పాయింట్లు పతనమైంది.

Indices flat amid volatility ahead of GDP data
జీడీపీ ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు డీలా
author img

By

Published : Nov 27, 2020, 3:45 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. దేశ జీడీపీ రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహించడం వల్ల ట్రేడింగ్​లో సూచీలు ఫ్లాట్​గా కొనసాగాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 110 పాయింట్లు పతనమైంది. ఓ దశలో 44 వేల పాయింట్ల మార్క్​ను కోల్పోయిన సూచీ తర్వాత పుంజుకుంది. చివరకు 44,150 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం స్వల్పంగా నష్టపోయింది. 18 పాయింట్లు దిగజారి.. 12,969 వద్ద ముగిసింది.

లాభనష్టాల్లోనివివే

ఆటో, ఫార్మా, లోహ సంబంధిత షేర్లలో కొనుగోళ్లు నమోదయ్యాయి. సెన్సెక్స్​ 30 షేర్లలో ఏషియన్​ పెయింట్స్​ అత్యధికంగా 1.63 శాతం లాభపడింది. టైటాన్, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ లాభాల్లో పయనించాయి.

పవర్​ గ్రిడ్, హెచ్​సీఎల్ టెక్, ఓఎన్​జీసీ, యాక్సిస్​ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు పతనమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.