కరోనా భయాలున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 134 పాయింట్లు పెరిగి 52,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,854 వద్దకు చేరింది. ఆటో, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,979 పాయింట్ల అత్యధిక స్థాయి, 52,612 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,878 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,764 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ ఎం, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఐటీసీ, టాటాస్టీల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్, టైటాన్, నెస్లే, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇవీ చదవండి: