దేశీయ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 294 పాయింట్లు బలపడి 43,572 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 12,720 పాయింట్లకు చేరుకుంది.
లాభనష్టాల్లో..
మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, టీసీఎస్, ఐటీసీ లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, పవర్‌గ్రిడ్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.