లాభాల్లోనే మార్కెట్లు..
దేశీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 40,429 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 11,863 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అమెరికా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఐటీ షేర్లు పుంజుకున్నాయి. ఫలితాల సరళి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌కు అనుకూలంగా కొనసాగుతుండడం మదుపర్ల సెంటిమెంటును బలపరిచింది.
లాభనష్టాల్లో..
ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు వెనకబడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురుర ధర 1.56 శాతం పెరిగి బ్యారెల్‌కు 40.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది.