బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర.. దిల్లీలో రూ.953 పెరిగి రూ.44,472కు చేరుకుంది.
"అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశీయంగా బంగారం ధర భారీగా పెరిగింది. రూపాయి పతనమూ ఈ పెరుగుదలకు కారణమైంది. చైనా వెలువల.. ముఖ్యంగా దక్షిణ కొరియా, మధ్య ఆసియా, ఇటలీలో కరోనా వైరస్ మరణాల వార్తలు రాగానే బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. "
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యురిటీస్
వెండి కూడా కిలోకు రూ.586 పెరిగి రూ.49,990కు చేరుకుంది.
రూపాయి మారకం విలువ సోమవారం భారీగా పడిపోయింది. 22 పైసలు తగ్గిన రూపాయి.. డాలరుతో పోలిస్తే 71.94కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,682 డాలర్లుగా ఉండగా.. వెండి 18.80కి చేరుకుంది.