అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవటం వల్ల నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 348 పెరిగి, రూ. 46,959కి చేరుకుంది.
పసిడి దారిలోనే వెండి ధరలూ పెరిగాయి. దిల్లీలో కిలో వెండి ధర రూ.794 పెరిగి రూ. 49,245కు చేరింది.
" అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగటం వల్ల దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 348 పెరిగింది. లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో ఆర్థిక, రవాణా సేవలు ప్రారంభమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడికి డిమాండ్ క్రమంగా పెరగనుంది."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ, సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 1,696 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్సుకు 17.68 డాలర్లకు పెరిగింది.