ETV Bharat / business

బడ్జెట్ ఎఫెక్ట్​: బంగారం ధరలకు రెక్కలు - సావరిన్ గోల్డ్

బడ్జెట్​లో బంగారం, విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం​ పెంచుతున్నట్లు చేసిన ప్రకటన... బులియన్​ మార్కెట్​పై తీవ్ర ప్రభావం చూపింది. దేశ రాజధానిలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గడం విశేషం.

రెక్కలు తొడిగిన బంగారం ధరలు
author img

By

Published : Jul 5, 2019, 5:49 PM IST

బంగారం, విలువైన లోహాలపై కస్టమ్స్​ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు బడ్జెట్​లో ప్రకటించిన నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.34,800కి చేరింది.

దిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములకు రూ.590లు పెరిగి వరుసగా రూ.34,800... రూ.34,630లకు చేరుకున్నాయని ఆల్​ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.

"బంగారం, విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం పెంచుతున్నట్లు బడ్జెట్​లో ప్రకటించడం వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే బంగారం వినియోగంపై దీని ప్రభావం ఉండబోదు."
-సురేంద్ర జైన్​, ఆల్ఇండియా సరాఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు

సావరిన్ గోల్డ్ ధర 8 గ్రాములకు రూ.200లు పెరిగి రూ.27,000లకు చేరుకుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశ రాజధానిలో వెండి ధర మాత్రం రూ.80ల వరకు తగ్గి కిలో రూ.38,500లుగా ఉంది. వారం వారీగా చూస్తే రూ.75లు పెరిగి... కిలో వెండి ధర రూ.37,225గా ఉంది.
వంద వెండి నాణేలు కొనుగోలు ధర రూ.80,000లు ఉండగా, వాటి అమ్మకం ధర రూ.81,000లుగా ఉంది.

ఇదీ చూడండి: 'బడ్జెట్​ లక్ష్యాల సాధనే అసలు సవాలు'

Intro:Body:

m

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.