అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ప్రభావం, భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ ప్రవేశించిన ప్రీమియం లోహాల ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 78 పెరుగుదలతో రూ. 39, 263 వద్ద స్థిరపడింది. కిలో వెండి ధర రూ. 245 పెరిగి రూ. 47, 735 వద్ద ముగిసింది.
"పెళ్లిళ్ల సీజన్ కారణంగా 24 క్యారట్ల బంగారం ధర రూ. 78 పెరిగింది. అంతర్జాతీయ విపణిలో ప్రీమియం లోహాల విలువ ప్లాట్‌గా ట్రేడయింది. "
-తపన్ పటేల్, సీనియర్ విశ్లేషకుడు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
అంతర్జాతీయ విపణిలో ఔన్సు పసిడి 1509 అమెరికన్ డాలర్లు కాగా.. వెండి 18 డాలర్లుగా నమోదయింది.
ఇదీ చూడండి: ప్రపంచ మిలియనీర్ల దేశాల్లో భారత్ స్థానం ఎంతో తెలుసా?