రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దిల్లీలో 10 గ్రాములపై రూ.300 తగ్గిన బంగారం ధర రూ.39,225 వద్ద స్థిరపడింది.
"దిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.300 తగ్గింది. డిమాండ్ తగ్గుదల, రూపాయి బలపడటం వల్ల పసిడి పరుగులకు బ్రేక్ పడింది. బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల డిమాండ్ తగ్గింది. "
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్
వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.1,400 తగ్గి రూ.48,500 వద్ద కొనసాగుతోంది.
అమెరికా డాలరుతో పోలిస్తే 14 పైసలు బలపడిన రూపాయి మారకం 71.58 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయంగా..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు స్తబ్దుగా కొనసాగాయి. న్యూయార్క్లో ఔన్సు బంగారం ధర 1,506 డాలర్లుగా ఉంది. వెండి ధర ఔన్సుకు 18.05 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటన దగ్గరలోనే ఉండటం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై సందిగ్ధంతో బంగారం ధరల్లో మార్పులేవీ రాలేదు.
ఇదీ చూడండి: లాభాలకు ఊతమిచ్చిన బ్యాంకింగ్, వాహన రంగాలు