బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువ బలపడటం వంటి ప్రధాన కారణాలతో మంగళవారం ఒక్కరోజే పసిడి ధర రూ.600 దిగొచ్చింది. బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి దిల్లీలో 10 గ్రాముల ధర రూ.34,870గా ఉంది.
వెండి ధర రూ.48 తగ్గింది. కేజీ రూ.38,900గా ఉంది.
డాలర్ విలువ గత మూడు వారాల గరిష్ఠానికి చేరడం, ఫెడరల్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం పసిడి ధర దిగిరావడానికి కారణమని విశ్లేషకులు తెలిపారు. పసిడి కొనుగోలుకు రెండో అతిపెద్ద వినియోగదారులు గల భారత్లో సుంకం పెంపుతో డిమాండ్ తగ్గిపోవడమూ మరో కారణమని చెప్పారు.
గతవారం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో పసిడి, ఇతర విలువైన ఆభరణాలపై 10 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 12.5కు పెంచింది కేంద్రం.
ఇదీ చూడండి: స్వల్ప లాభాలతో గట్టెక్కిన సెన్సెక్స్- ఫ్లాట్గా నిఫ్టీ