దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.1,049 తగ్గి రూ.48,569 వద్ద స్థిరపడింది.
వెండి ధర కూడా కిలోకు రూ.1,588 క్షీణించి రూ.59,301కు దిగొచ్చింది.
"కరోనా టీకా క్యాండిడేట్ల తయారీలో పురోగతితో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే ఆశలు పెరిగాయి. అందువల్ల మదుపరులు ఇతర పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నారు. అధికార బదిలీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించడం, రూపాయి మారకం బలపడటం వంటి కారణాలతో బంగారం ధరలు తగ్గాయి."
- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,830 డాలర్లుగా ఉండగా.. వెండి ధర 23.42 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి: మార్కెట్ల రికార్డు- జీవిత కాల గరిష్ఠస్థాయిలో సూచీలు