బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.24 తగ్గి రూ.52,465 వద్దకు చేరింది.
వెండి మాత్రం కిలోకు రూ.222 పెరిగి రూ.69,590కి చేరింది.
రూపాయి బలపడటం వల్ల బంగారం ధరల్లో స్వల్ప మార్పులు వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ సీనియర్ విశ్లేషకులు తపన్ పటేల్ వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకు 1,945.5 డాలర్లు ఉండగా.. వెండి 26.87 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: ఐటీ ఊతమిచ్చినా మార్కెట్లను ముంచిన ఆర్థిక షేర్లు