తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బంగారం ధరలు (Gold Rate Today)భారీగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే రూ.200 మేర పెరిగిన పది గ్రాముల మేలిమి బంగారం ధర.. ప్రస్తుతం రూ.49,694 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర (Silver price today)యథాతథంగా కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా...
- హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర (Gold Price in Hyderabad) రూ.49,694గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,419కి చేరింది.
- విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు (Gold Price in Vijayawada) రూ.49,694 వద్ద ట్రేడవుతోంది. కేజీ వెండి ధర రూ.67,419 వద్ద కొనసాగుతోంది.
- విశాఖపట్నంలో బంగారం ధర (Gold Price in Vizag) పది గ్రాములకు రూ.49,694గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,419 వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా...
అంతర్జాతీయంగానూ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1804 డాలర్లుగా ట్రేడవుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.42 డాలర్లు పలుకుతోంది.
చమురు ధరలు ఇలా..
మంగళవారం చమురు ధరలు పెరగలేదు. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలను పెంచూతూ వస్తున్న సంస్థలు.. కాస్త విరామం ఇచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
- హైదరాబాద్లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.111.87కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్కు రూ.105.04 కి చేరింది.
- గుంటూరులో (Petrol Price in Guntur) పెట్రోల్ ధర లీటర్కు రూ.113.89కి చేరింది. డీజిల్ రూ.106.46 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో (Petrol Price in Vizag) లీటర్ పెట్రోల్ ధర రూ.112.62 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.23గా ఉంది.
ఇదీ చదవండి: Alibaba News: ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు!