ETV Bharat / business

స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగేనా? - షేర్ మార్కెట్ ఔట్​లుక్

స్టాక్ మార్కెట్లకు (Stock market) ఈ వారం అంతర్జాతీయ పరిణామాలు దిశా నిర్దేశం (Market Outlook) చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత వారం సరికొత్త రికార్డులు (Stock Market records) సృష్టించిన సూచీలు.. ఈ వారం ఆ జోరును కొనసాగిస్తాయా?

Stocks Outlook for This week
స్టాక్ మార్కెట్ అంచనాలు
author img

By

Published : Sep 26, 2021, 4:56 PM IST

స్టాక్ మార్కెట్లపై (Stock Markets) ఈ వారం అంతర్జాతీయ పరిణామాల ప్రభావం అధికంగా ఉండొచ్చని (Market Outlook) తెలుస్తోంది. అయితే నెలాఖరు ఈ వారంలోనే ఉండటం, సూచీలు కొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న నేపథ్యంలో కాస్త ఒడుదొడుకులకు అవకాశమున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో 2-3 ఏళ్లు మార్కెట్ల జోరు..

బీఎస్​ఈ-సెన్సెక్స్​ గత వారం 60 వేల మార్క్​ పైన (Sensex new records) స్థిరపడింది. ఈ-ఏడాది జనవరిలోనే 50 వేల మార్క్​ను అందుకున్న సెన్సెక్స్​ 8 నెలల్లోనే 10 వేల పాయింట్లు ఎగబాకటం విశేషం.

'దేశీయంగా ఉన్న అన్ని అనిశ్చితులను దాటుకుంటూ బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లలో 2003-2007 నాటి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2-3 ఏళ్లు సూచీలు ఈ జోరును కొనసాగించే అవకాశముంది' అని స్వస్థికా ఇన్వెస్ట్​మెంట్​ పరిశోధన విభాగాధిపతి సంతోశ్​ మీనా పేర్కొన్నారు. అయితే రికార్డు స్థాయిల వద్ద స్వల్పకాల ఒడుదొడుకులు ఉంటాయని స్పష్టం చేశారు.

మోతీలాల్​ ఓశ్వాల్​ ఫినాన్షియల్ సర్వీసెస్​ కూడా మార్కెట్లపై సానుకూల అంచనాలనే విడుదల చేసింది. స్వల్ప కాలంలో ఒడుదొడుకులున్నా.. ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వటం, కార్పొరేట్ల ఫలితాలపై సానుకూల అంచనాల వంటి కారణాలతో మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశముందని విశ్లేషించింది. 2021-22 రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటనను కార్పొరేట్లు వచ్చే వారం ప్రారంభించనున్నాయి.

వారాంతంలో సెప్టెంబర్ నెలకు సంబంధించి.. వాహన విక్రయాలు, పీఎంఐ వంటి గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై అధికంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటితో పాటు.. కరోనా కేసులు, వ్యాక్సినేషన్​ అప్​డేట్స్​, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఆహార వ్యర్థాలే ఈ అంకుర సంస్థకు పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.