ETV Bharat / business

క్యూ2 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలే కీలకం! - స్టాక్ మార్కెట్ వార్తలు

త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock markets) కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఆర్థిక గణాంకాలపైనా మదుపర్లు దృష్టి సారించే అవకాశముందని చెబుతున్నారు.

Markets outlook
ఈ వారం స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Nov 7, 2021, 1:46 PM IST

ఈ వారం స్టాక్​ మార్కెట్లకు(Stock markets) అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక గణాంకాలు దిశా నిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారంలో అమెరికా, చైనా ద్రవ్యోల్బణ రేటులను ప్రకటించనున్నాయి. ఇవి కూడా మార్కెట్లకు(Markets outlook) కీలకం కానున్నాయి.

"విదేశీ సంస్థాగత మదుపర్ల(ఎఫ్​ఐఐఎస్​) ప్రవర్తనతో పాటు అమెరికా, చైనాలోని ద్రవ్యోల్బణ రేట్లు ఈ వారం మార్కెట్ల కదలికలను కొంత మేర ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు సానుకూలంగా ప్రారంభం కావచ్చు. అయితే పలు కంపెనీ షేర్లు విలువ జీవిత కాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో.. అమ్మకాల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది."

- సంతోష్​ మీనా, స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ హెడ్​(పరిశోధన)

నవంబరు 10న అమెరికా, చైనా ద్రవ్యోల్బణ రేట్లను ప్రకటించనున్నాయి. ఇవి స్టాక్​ మార్కెట్లపై అత్యంత ప్రభావం చూపే అవకాశముంది. వీటితో పాటు వెల్లడి కానున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచిక(ఐఐపీ) గణాంకాలను మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు.

ముత్తూట్​ ఫైనాన్స్​, బ్రిటానియా, మహీంద్రా అండ్​ మహీంద్రా(ఎం అండ్​ ఎం), బీహెచ్​ఈఎల్​, ఓఎన్​జీసీ వంటి కంపెనీల క్యూ ఫలితాలు దేశీయ సూచీల కదలికలను కొంత ప్రభావితం చేయవచ్చు.

ఇదీ చూడండి: 'టెస్లా స్టాక్​ అమ్మాలనుకుంటున్నా!- మీరేమంటారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.