కొవిడ్-19 ట్రెండ్స్, వ్యాక్సినేషన్ అప్డేట్స్, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ముందుకు నడిపించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీటితో పాటు.. రుతుపవనాల రాక కూడా సానుకూల అంశంగా నిలువనున్నట్లు చెప్తున్నారు.
నెలవారీ డెరివేటివ్‌ల గడువు ముగింపుతో మార్కెట్ కొంచెం ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని రెలీగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగ ఉపాధ్యక్షుడు అజిత్ మిశ్రా అంచనా వేశారు. రుతుపవనాల పురోగతి, టీకా పంపిణీ పై కూడా మదుపరులు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
రుతుపవనాల రాక, టీకా పంపిణీ వార్తలు ఈ వారం మార్కెట్‌ను ముందుకు నడుపుతాయి.
-సిద్ధార్థ్ ఖేమ్కా, మోతీలాల్ ఓస్వాల్ రిటైల్ రీసెర్చ్ హెడ్
వీటితో పాటు.. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు, రూపాయి హెచ్చుతగ్గులు, విదేశీ మదుపరులు వ్యవహరించే తీరు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.
ఇవీ చూడండి: 'భారత్‌లో 19,230 ఉద్యోగాలిస్తాం'