మనం రోజుకు ఎంత సంపాదిస్తాం. రూ. 500, రూ. 1000, రూ.2000.. ఇలా ఉండొచ్చు. రోజుకు రూ. 5 నుంచి 10 వేలు సంపాదిస్తేనే వామ్మో అనుకుంటాం. అలాంటిది లక్షలు కాదు, కోట్లు కాదు.. లక్షల కోట్లు సంపాదిస్తే? అసాధ్యం అంటారా? కానే కాదు.. దీనిని సాధ్యం చేసి చూపించారు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్(Musk news today).
ఒక్కరోజులోనే ఆయన (Musk tesla shares) రూ. 2.71 లక్షల కోట్లు సంపాదించారు. ఈ స్థాయిలో ఆయన సంపద పెరగడానికి ఒకే ఒక్క డీల్ కారణం.
హెర్ట్జ్ గ్లోబల్ హోల్డింగ్స్.. తాజాగా లక్ష టెస్లాలకు(Elon Musk net worth today) ఆర్డర్ ఇవ్వడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో టెస్లా షేరు (Tesla stock) ఒక్కరోజులో దాదాపు 15 శాతం ఎగబాకి.. 1045 డాలర్లకు (Tesla share price) చేరింది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా టెస్లా ఘనత సాధించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
దీంతో కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించింది. టెస్లాలో మస్క్ వాటానే 23 శాతం మేర ఉంది. ఇది సుమారు 289 బిలియన్ డాలర్లు (Elon Musk net worth today).
వాటి సరసన..
కార్లను ఉత్పత్తి చేసే సంస్థగా.. టెస్లాకు(Tesla news) ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. ట్రిలియన్ డాలర్ కంపెనీల జాబితాలో చేరిన తొలి ఆటోమొబైల్ కంపెనీ కూడా టెస్లానే. యాపిల్, అమెజాన్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, అల్ఫాబెట్ ఈ జాబితాలో ఉన్నాయి.
మస్క్‌కు(Musk news today) స్పేస్ ఎక్స్‌లోనూ భారీగా వాటాలు ఉన్నాయి. 2021లోనే మస్క్ సంపద 119 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.
ఇవీ చూడండి: Tesla India: 'భారత్‌లో తయారీ ప్రారంభిస్తే.. ప్రయోజనాలు కల్పిస్తాం'