ETV Bharat / business

దలాల్​ స్ట్రీట్​ ఢమాల్​- సెన్సెక్స్​ రికార్డు పతనం - sensex news

దేశీయ స్టాక్​ మార్కెట్ల చరిత్రలో నేడు బ్లాక్ మండేగా నిలిచిపోనుంది. సెన్సెక్​, నిఫ్టీ ఒక్కరోజులో అత్యధిక పతనాలను చవిచూశాయి. సెన్సెక్​ 1,942, నిఫ్టీ 538 పాయింట్లు పతనమయ్యాయి.

దలాల్​ స్ట్రీట్​లో మారణహోమం- సెన్సెక్స్​ రికార్డు పతనం

author img

By

Published : Mar 9, 2020, 3:50 PM IST

Updated : Mar 9, 2020, 11:51 PM IST

దలాల్​ స్ట్రీట్​లో నేడు 'బేర్'​ మారణహోమం సృష్టించింది. సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభించినప్పటి నుంచి రికార్డు స్థాయి ఒక్కరోజు పతనాలు నమోదు చేశాయి. దేశీయ స్టాక్​ మార్కెట్ల చరిత్రలో ఈ రోజు బ్లాక్ మండేగా మిగిలిపోనుంది.

బేర్​ ధాటికి సెన్సెక్స్​ 1942 పాయింట్లు పతనమై 35,635 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 538 పాయింట్లు క్షీణించి 10,451 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్​, నిఫ్టీ సూచీలు ఒక్కరోజులో భారీ పతనాలను నమోదు చేశాయి.

7 లక్షల కోట్లు ఆవిరి

వరుసగా రెండోరోజు మదుపరులు భారీగా నష్టపోయారు. రికార్డు స్థాయిలో స్టాక్ మార్కెట్లు పతనమైన కారణంగా మదుపరులు రూ.7 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.

అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఓఎన్​జీసీ, రిలయన్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టీసీఎస్​, టాటాస్టీల్​, ఎల్​ అండ్​ టీ భారీ నష్టాల్లో ఉన్నాయి. ఎస్బీఐ 49 శాతం వాటా కొనుగోలు ప్రకటనతో ఎస్ బ్యాంకు షేర్లు 31 శాతం పెరిగాయి.

కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలైన వేళ.. దేశీయ షేర్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఒపెక్ దేశాలు, రష్యా మధ్య చమురు యుద్ధానికి దారి తీసిన పరిస్థితులతో పశ్చిమాసియా మార్కెట్ల ఎన్నడూలేనంతగా పతనమవటమూ దేశీయ సూచీలపై ప్రభావం పడింది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ

ఆసియా మార్కెట్లు కుదేలు..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావంతో ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. జపాన్​, చైనా, హాంకాంగ్​, సింగపూర్​, దక్షిణ కొరియా మార్కెట్లన్నీ 3 శాతానికి మించి నష్టపోయాయి.

చమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. కువైట్ ప్రీమియర్ సూచీ​ 9.5 శాతం పతనం కావటం వల్ల ట్రేడింగ్​ను నిలిపేశారు. దుబాయ్​ ఫినాన్షియల్​ మార్కెట్​ 9 శాతం, అబుదబీ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజి 7.1 శాతం పడిపోయాయి.

చమురు ధరలు..

చమురు యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు 30 శాతం పడిపోయి బ్యారెల్​కు 36.97 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Last Updated : Mar 9, 2020, 11:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.