అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్య భయాలు సహా ఆగస్టు డెరివేటివ్ సిరీస్ ఎక్స్పైరీ నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,068 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 10,948 వద్దకు చేరింది.
లాభాల్లో...
సన్‌ఫార్మా, వేదాంత, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి.
నష్టాల్లో...
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహింద్రా బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి.
రూపాయి...
రూపాయి విలువ స్వల్పంగా పెరిగి యూఎస్ డాలరుకు రూ.71.73గా ఉంది.
బంగారానికి రెక్కలు...
బంగారం విలువ రికార్డ్ స్థాయిని అందుకుంది. 10 గ్రాముల బంగారం విలువ రూ.250 పెరిగి రూ. 40,220కి చేరింది.
- ఇదీ చూడండి: రిజర్వు బ్యాంక్ నిధులే మాంద్యానికి ఔషధమా?