ETV Bharat / business

ఆటో డెబిట్​ సేవలకు ఇక కొత్త రూల్స్ - ఆటో డెబిట్ కొనసాగాలంటే ఏం చేయాలి

మీరు నెల నెలా చేయాల్సిన పేమెంట్స్​ కోసం ఆటో డెబిట్​ సదుపాయాన్ని ఎంచుకున్నారా? అయితే జాగ్రత్త. ఏప్రిల్ 1 నుంచి మీ చెల్లింపులు ఆగిపోవచ్చు. ఆర్​బీఐ తెచ్చిన కొత్త రూల్స్​ వల్ల మీ పేమెంట్స్ ఫెయిల్​ కావచ్చు. ఇంతకీ ఏంటా కొత్త నిబంధనలు? ఆటో డెబిట్​ ఆగిపోవద్దంటే ఏం చేయాలి?

RBI new rules to Auto Debit
ఆటో డెబిట్​కు ఆర్​బీఐ కొత్త రూల్స్
author img

By

Published : Mar 30, 2021, 4:50 PM IST

టీవీ రీచార్జ్​, ఓటీటీ, పోస్ట్​పెయిడ్​ సర్వీసులు​, యుటిలిటీ ఇలా ఏదో ఒక అవసరానికి ప్రతి నెలా బిల్లు చెల్లిస్తుంటారు చాలా మంది. అయితే వాటి పేమెంట్​ తేదీలు మర్చిపోతామేమోనని.. క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగిస్తుంటారు. దీని ద్వారా యూజర్​ ప్రమేయం లేకుండానే ఆయా బిల్లుల చెల్లింపు జరిగిపోతుంటుంది. అయితే ఇప్పుడు ఆటో డెబిట్​ సదుపాయానికి సంబంధించి ఆర్​బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ఏమిటా కొత్త రూల్స్?

ఆటో డెబిట్​ ద్వారా జరిగే బిల్లుల చెల్లింపుల్లో .. ఏప్రిల్​ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే ఆటో డెబిట్​కు ఇకపై ఓటీపీ ఆధారిత నిర్ధరణ తప్పనిసరి చేసింది ఆర్​బీఐ.

కొత్త రూల్స్​ ప్రకారం ఆటో డెబిట్​ షెడ్యూల్ తేదీకి.. ఐదు రోజుల ముందు సంబంధిత బ్యాంక్ నుంచి యూజర్లకు అలర్ట్​ వస్తుంది. అప్పుడు వన్​ టైమ్ పాస్​వర్డ్​తో వెరిఫై చేస్తేనే ఆటో డెబిట్​ పూర్తవుతుంది. లేదంటే పేమెంట్ పూర్తికాదు. అప్పుడు.. యూజర్లు తమ బిల్లులను మాన్యువల్​గా చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:ఫోన్‌లో వైరస్‌.. గుర్తించడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.