టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్లో జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు పెరిగిన కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఏకంగా 10.49 శాతంగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
ఈ ఏడాది మార్చిలో డబ్ల్యూపీఐ 7.39 శాతంగా నమోదవగా.. 2020 ఏప్రిల్లో -1.57 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టోకు ద్రవ్యోల్బణం పెరగటం వరుసగా ఇది 4వ నెల.
- ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 4.92 శాతంగా నమోదైంది. అధిక ప్రోటీన్లు ఉండే గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరగటం ఇందుకు కారణం.
- కూరగాయల టోకు ద్రవ్యోల్బణం గత నెల -9.03 శాతంగా నమోదైంది. మార్చిలో ఇది -5.19 శాతంగా ఉంది.
- పప్పు ధాన్యాలు, పండ్ల టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో వరుసగా 10.74 శాతం, 27.43 శాతంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
- ఇంధన, విద్యుత్ డబ్ల్యూపీఐ 20.94 శాతంగా నమోదైంది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 9.01 శాతంగా ఉంది.
ఇదీ చదవండి:ఆ 14 గంటలు నెఫ్ట్ సేవలు బంద్!