ETV Bharat / business

WPI inflation: తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ!

వరుసగా మూడో నెలలోనూ (జూన్​లో) టోకు ద్రవ్యోల్బణం(India Wholesale Price Index) రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. అయితే మే నెలతో పోలిస్తే.. టోకు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

June WPI data
జూన్​ టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు
author img

By

Published : Jul 14, 2021, 12:51 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(WPI inflation) జూన్​లో​ జీవితకాల గరిష్ఠ స్థాయి నుంచి కాస్త దిగొచ్చింది. డబ్ల్యూపీఐ గత నెల 12.07 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతంగా ఉంది. 2020 జూన్​లో డబ్ల్యూపీఐ 1.81 శాతంగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ముడి చమురు​, ఆహార ఉత్పత్తుల ధరలు కాస్త తగ్గటం వల్ల టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు పేర్కొంది వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ డబ్లూపీఐ సూచీ రెండంకెల వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.

  • ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం జూన్​ నెలలో (మేతో పోలిస్తే) 37.61 శాతం నుంచి 32.83 శాతానికి తగ్గింది.
  • ఆహార పదార్థాల ద్రవ్యోబ్బణం మేలో 4.31 శాతంగా నమోదవగా.. జూన్​లో 3.09 శాతానికి దిగొచ్చింది.
  • తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం జూన్​లో 10.88 శాతానికి పెరిగింది. మేలో ఇది 10.83 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:భారత్‌కు మళ్లీ 'బీబీబీ' రేటింగే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.