నవంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 1.55 శాతంగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ 0.58 శాతంగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 1.48 శాతంగా నమోదైంది.
2020 ఫిబ్రవరి (2.26 శాతం) తర్వాత టోకు ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగటం ఇదే ప్రథమం. తయారీ ఉత్పత్తుల ధరల్లో వృద్ధి గత నెల టోకు ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
- ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే గత నెల 6.37 శాతం నుంచి 3.94 శాతానికి తగ్గింది.
- కూరగాయలు, బంగాళ దుంపల ద్రవ్యోల్బణం నవంబర్లోనూ భారీ స్థాయి అయిన 12.24 శాతం, 115.12 శాతం వద్ద ఉన్నాయి.
- ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.43 శాతంగా నమోదైంది.
- ఇంధన, విద్యుత్ ద్రవ్యోల్బణం మాత్రం -9.87 శాతంగా నమోదవటం గమనార్హం.
ఇదీ చూడండి:తొలి ట్రేడ్‌లో 'బర్గర్ కింగ్' రికార్డులు