ETV Bharat / business

ఆర్​బీఐ ద్రవ్యపరపతి సమీక్షలో రేట్ల కోత సాధ్యమేనా? - రెపో రేటు కోత

కరోనా సంక్షోభం, ఆర్థిక వృద్ధి మందగమనం భయాల నడుమ ఆర్​బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటికే కనిష్ఠ స్థాయి వద్ద ఉన్న రెపో రేటును ఆర్​బీఐ మళ్లీ తగ్గించొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఆర్​బీఐ గురువారం వెల్లడించే నిర్ణయాల్లో రెపో రేటు తగ్గింపు ఉంటుందా? నిపుణులు ఏమంటున్నారు?

RBI MPC
ఆర్​బీఐ ద్రవ్యపరపతి సమీక్ష
author img

By

Published : Aug 5, 2020, 9:13 PM IST

Updated : Aug 5, 2020, 10:59 PM IST

ఆర్​బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆగస్టు 4న ప్రారంభమైన సమావేశం గురువారం ముగియనుంది. అనంతరం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ఆర్​బీఐ ప్రకటన చేయనుంది.

సమీక్ష నిర్ణయాల్లో రెపో రేటు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. రిటైల్​ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతలను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తగ్గించే అవకాశం..

అయితే ద్రవ్యోల్బణం పెరిగినా వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గిస్తుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని మరో రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..

ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభం ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ఇప్పటికే కీలక వడ్డీ రేట్లను 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్​బీఐ. కరోనా కారణంగా నగదుకు ఇబ్బంది లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది.

రెండు సార్లు వడ్డీ తగ్గింపుతో రెపో రేటు ప్రస్తుతం 4 శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉన్నాయి.

వీటికి తోడు రుణాల పునర్​వ్యవస్థీకరణ సహా మరిన్ని అంశాలను పరిశీలించమని పరిశ్రమ వర్గాల నుంచి ఆర్​బీఐకి వినతులు వస్తున్నాయి. వీటన్నింటిపై ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను గురువారం వెల్లడించనున్నారు.

ఇదీ చూడండి: మంగళవారం నుంచి ఆర్​బీఐ సమీక్ష- రేట్ల కోత ఖాయం!

Last Updated : Aug 5, 2020, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.