ETV Bharat / business

కరోనాపై పోరులో బ్యాంకుల పాత్ర అంత కీలకమా? - కరోనా వైరస్ జాగ్రత్తలు

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర చాలా కీలకం కానుంది. పీఎం గరీబ్ కల్యాణ్ పథకం కింద ప్రకటించిన రూ .1.7 లక్షల కోట్ల ఫలాలను ప్రజలకు అందించే బాధ్యత వీటిపైనే ఉంది.

psu
బ్యాంకులు
author img

By

Published : Mar 31, 2020, 9:49 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. 21 రోజుల లాక్ డౌన్ వ్యవధిలో అన్ని స్థాయిల్లో.. బ్యాంకు శాఖలు, ఏటీఎంలు, అనుబంధ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందేలా చూడాలని వారిని నిర్మల ఆదేశించారు.

నగదు లభ్యతతో పాటు కరోనాపై మోదీ ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర చాలా కీలకం కానుంది. ఎందుకంటే.. కరోనాను ఎదుర్కొనేందుకు పీఎం గరీబ్ కల్యాణ్ పథకం కింద రూ.1.7 లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ పథకానికి సంబంధించిన ఫలాలను ప్రభుత్వ రంగ బ్యాంకులే ప్రజలకు చేరవేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సహకారాన్ని కొనసాగించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్మల కోరారు.

వీటి పాత్రే కీలకం..

కరోనా ఉపశమన ప్యాకేజీ రూ.1.7 లక్షల కోట్లను ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులపైనే సర్కారు యంత్రాంగం ఆధారపడింది. కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్యాకేజీని ప్రకటించారు మోదీ.

దేశంలో 20 కోట్ల మంది మహిళలకు జన్ ధన్ ఖాతాలు ఉండగా.. అందులో 95 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న కారణంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయటంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే కీలక పాత్ర పోషించనున్నాయి.

బ్యాంకుల ద్వారానే..

దేశవ్యాప్తంగా 38.28 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. అందులో మహిళల ఖాతాలు 53 శాతం. ఈ ఖాతాల్లో నెలకు 500 చొప్పున 3 నెలలపాటు మొత్తం రూ.1.18 లక్షల కోట్లు ప్రభుత్వం అందించనుంది. దీనికి అదనంగా 3 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.1,000లను బ్యాంకుల ద్వారానే బదిలీ చేయనుంది ప్రభుత్వం. అంతేకాకుండా.. ఏప్రిల్ మొదటి వారంలో 8.7 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద మొదటి విడతగా రూ.2 వేలు చెల్లించనుంది.

ఈ విధంగా గరీబ్ కల్యాణ్ పథకం అమలుకు బ్యాంకులకు చెందిన విస్తృతమైన యంత్రాంగంపై ప్రభుత్వం ఆధారపడింది. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు 87 వేలు ఉన్నాయి. అందులో మూడోవంతు అంటే.. 29 వేల శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు దేశంలో 1.34 లక్షల ఏటీఎంలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 27 వేలు ఉన్నాయి.

6 లక్షల అనుబంధ సంస్థలు

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు రంగం కాస్త వెనకబడి ఉంది. దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకులకు 32 వేల శాఖలు, 69 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో కేవలం 6,846 శాఖలు, 5,759 ఏటీఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులకు 6 లక్షల అనుబంధ సంస్థలు (బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్) ఉన్నాయి. ఇవీ దేశంలోని 6 లక్షల గ్రామాల్లో ప్రతి మూలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. దేశంలోని 70 శాతం వ్యాపార కరెస్పాండెంట్స్ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల అధీనంలోనే ఉన్నాయి.

లాక్ డౌన్ కు అదే కీలకం..

లాక్ డౌన్ విజయవంతం కావాలంటే ఈ ఉపశమన ప్యాకేజీ అమలు కీలకం కానుంది. లాక్ డౌన్ ప్రతికూల ప్రభావం నుంచి దాదాపు 80 కోట్ల మందిని రక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆహారం, ధాన్యం ఉచితంగా అందించడం సహా నగదు బదిలీ లబ్ధిదారులందరికీ జరగాల్సిన అవసరం ఉంది.

గరీబ్ కల్యాణ్ పథకాన్ని మూడు లక్ష్యాలతో కేంద్రం ప్రవేశపెట్టింది. అవి.. 3 నెలలపాటు ఆహారం, ఇంధనం, పేద ప్రజలకు నగదు లభ్యత. ఎందుకంటే ఈ 3 వారాల్లో అనుకున్న ఫలితాలు రాకపోతే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

ఏదిఏమైనా.. దేశంలో అధికంగా ఉన్న పేదల కనీస అవసరాలు తీర్చకుండా లాక్ డౌన్ విజయవంతం కాలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన ఉపశమనం ప్యాకేజీ తొందరగా చేరకపోతే ఆంక్షలను ప్రజలు ధిక్కరించే అవకాశం లేకపోలేదు. అందువల్ల కరోనాపై పోరాటంలో ప్రజల అవసరాలు తీర్చటం కీలకం. అందుకోసం సమయానికి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, దాని అనుబంధ సంస్థల సహకారం ముఖ్యం.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ వేళ పోలీసులే డెలివరీ బాయ్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.