ETV Bharat / business

వయసుకు తగ్గ ఆరోగ్య బీమా ఎంపిక ఎలా? - ఆరోగ్య బీమాపై కరోనా ప్రబావం ఎంత

కరోనా వల్ల చాలా మందికి ఆరోగ్య బీమా పట్ల ఆసక్తి పెరిగింది. అయితే కరోనా ఉన్నా లేకున్నా.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ.. ఏ వయసులో ఆరోగ్య బీమా అవసరం ఎంత? దాని ఉపయోగాలు ఏమిటి?

Need of Health insurance
ఆరోగ్య బీమా అవసరం ఎంత
author img

By

Published : Jul 19, 2021, 2:57 PM IST

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరికీ నేర్పిన పాఠం ఏదైనా ఉంది అంటే.. అది ఆరోగ్య సంరక్షణ. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైతే ఆర్థికంగా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వస్తే.. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ఉన్న ఉత్తమ మార్గం ఆరోగ్య బీమా.

ప్రస్తుతం మార్కెట్లో అనేక బీమా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ అవసరాలకు తగ్గట్లు.. మీతో పాటు మీ కుటుంబానికి కూడా రక్షణ కల్పించే బీమా తీసుకోవడం ఎంతో ముఖ్యం. సగటు వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో ఆరోగ్య బీమా ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.

పెళ్లి కాని యువత

ఈ వయసులో సాధారణంగా బాధ్యతలు కాస్త తక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ వయసులో ఉన్నప్పుడే మంచి ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది భవిష్యత్​ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది.

చిన్న వయసులో ఆరోగ్య బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా చెల్లించి, లాభాలు ఎక్కువగా పొందే వీలుంది. దీనితో పాటు 'నో క్లెయిమ్​ బోనస్' పొందే అవకాశాలు ఉంటాయి. ఏడాదిలో ఒక్కసారి కూడా బీమా క్లెయిమ్​ చేసుకోకుంటే.. బీమా కంపెనీలు కొంత మొత్తాన్ని బోనస్​గా ఇస్తాయి. దానినే 'నో క్లెయిమ్​ బోనస్'​ అంటారు.

పెళ్లై పిల్లలు ఉంటే..

ఈ దశలో మీకు పూర్తి స్థాయి ప్రమాద ఆరోగ్య బీమా అవసరం. ఎందుకంటే ఈ దశలో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. మెడికల్ ఖర్చులు జీవితాన్ని అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఇది మీ పిల్లలో చదువు, భవిష్యత్​ను కూడా దెబ్బతీయొచ్చు.

ఈ దశలో కుటుంబ సభ్యులు, వైద్య అవసరాలకు తగ్గట్లు.. అందరికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ, సభ్యులందరికీ కలిపి వేరు వేరు పాలసీలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకునే ముందు.. భారత్​ సహా విదేశాల్లోనూ కుటుంబం మొత్తానికి పూర్తి ఆరోగ్య సంరక్షణనిస్తుందా? అనేది నిర్ధరించుకోవాలి. అందుకు తగ్గ పాలసీకి కాస్త ప్రీమియం ఎక్కువున్నా.. దానినే తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

రిటైర్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న దంపతులకు/ఇప్పటికే రిటైర్​ అయినవాళ్లకు

ఈ దశలో మీ నెలవారీ ఆదాయం తగ్గుతుంది. పెన్షన్​, రిటైర్మెంట్ ఫండ్ మాత్రమే మీ ప్రధాన ఆదాయ వనరు అవుతుంది. ఈ వయసులో ఆరోగ్య సమస్యలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాటన్నింటి నుంచి ఆర్థికంగా భద్రత కల్పించే బీమా పాలసీ అవసరం.

ఈ దశలో మీకు సమగ్ర ఆరోగ్య బీమా అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ వయసులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా.. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎంతైనా అవసరం.

చివరగా..

ఆరోగ్య బీమా అనేది ప్రతి ఒక్కరికీ ఎంతైనా అవసరం. ఆరోగ్య సమస్యలు వస్తే ఆర్థికంగా కూడా చితికిపోకుండా ఇవి కాపాడతాయి. కాబట్టి ఆరోగ్య బీమా ఎందుకు అవసరం? అనే విషయం కంటే ఎలాంటి పాలసీ అవసరం? అనే విషయం గురించి ఆలోచించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.

సరైన ఆరోగ్య బీమా ద్వారా మీతో పాటు మీ కుటుంబానికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా.. నాణ్యమైన వైద్యంతో పాటు.. ఆర్థికంగా కూడా భరోసా పొందగలుగుతారని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ టిప్స్​ ఫాలో అయితే క్రెడిట్‌ కార్డ్‌తో చిక్కులే ఉండవ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.