టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మార్చిలో భారీగా దిగొచ్చింది. ఆహార పదార్థాలు, కూరగాయల ధరల తగ్గుదలతో మార్చిలో 1 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.26 శాతంగా ఉంది.
- ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 7.79 శాతం నుంచి 4.91 శాతానికి తగ్గింది.
- కూరగాయల ద్రవ్యోల్బణం మార్చిలో 11.90 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరిలో ఇది 29.97 శాతంగా ఉంది.
- ఉల్లిపాయల ద్రవ్యోల్బణం మాత్రం మార్చిలోనూ అత్యధికంగా 112.31 శాతంగా నమోదైంది.
- ఇంధన, విద్యుత్ విభాగాల్లో 1.76 శాతంగా, తయారీ రంగంలో 0.34 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది.
దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గణాంకాల సేకరణపై కొంత ప్రభావం పడినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కారణంగా మార్చి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాల్లో సవరణలకు అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఇదీ చూడండి:క్రెడిట్ స్కోర్ బాగుంటేనే జీవిత బీమా!