ETV Bharat / business

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధిస్తే ఏం జరుగుతుంది?

కరోనా లాక్​డౌన్ వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఆలోచన లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినా.. తాజాగా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఒకవేళ దేశంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి విధిస్తే ఏం జరుగుతుంది?

Financial Emergency
ఆర్థిక ఎమర్జెన్సీ
author img

By

Published : Apr 9, 2020, 2:53 PM IST

కరోనా వైరస్ విజృంభణతో దేశం నానాటికీ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది. లాక్​డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది. స్టాక్ మార్కెట్లు భారీ పతనాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక అత్యయిక స్థితి విధించాలని పలువురు సూచిస్తున్నారు.

సుప్రీంకోర్టులోనూ ఈ మేరకు పిటిషన్ దాఖలైంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా అత్యవసర స్థితిని విధించటమే పరిష్కారమని పిటిషన్ వేసిన 'సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ ఛేంజ్ (సీఏఎస్సీ)' వాదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ని వినియోగించాలని కోరింది.

బిల్లుల రద్దునూ..

వినియోగ బిల్లు వసూళ్లను రద్దు చేయాలని పిటిషన్​లో కోరింది సీఏఎస్సీ. విద్యుత్, నీళ్లు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్, ఈఎంఐ తదితర చెల్లింపులను నిలిపేయాలని సూచించింది. ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఈ నెల చివర్లో విచారించనుంది.

అయితే ఆర్థిక అత్యయిక స్థితిపై మార్చి మొదటివారంలోనే కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎమర్జెన్సీ విధించే అవసరం లేదని తెలిపారు. ఒకవేళ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి వస్తే ఏమవుతుంది? అసలేంటి ఈ ఎమర్జెన్సీ? ఆర్టికల్ 360 ఏం చెబుతోంది?

ఎమర్జెన్సీ..

భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో 3 రకాలు ఎమర్జెన్సీలు విధించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 360 కల్పిస్తోంది. దీని ప్రకారం ప్రధాని, మంత్రి మండలి సలహాతో రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా రాష్ట్రపతి కూడా దీన్ని అమల్లోకి తేవచ్చు.

రెండు నెలల వరకూ..

ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు ఎమర్జెన్సీ చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 2 నెలలకు మించి పొడిగిస్తే.. పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో అరుదైన సందర్భాల్లో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యే వేళ పరిస్థితుల్ని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. ఈ ఎమర్జెన్సీతో రాష్ట్రాలు తమ ఆర్థిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైనా..

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ చట్టంతో కేంద్రానికి అధికారం కల్పిస్తుంది. రాష్ట్రపతి కూడా ఉద్యోగులతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జీతాల సవరణకు ఆదేశాలు ఇవ్చవచ్చు.

ఎమర్జెన్సీ సమయంలో అధికరణ 207 ప్రకారం.. ఆర్థిక బిల్లు లేదా ఇతర బిల్లులను రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు.

దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఇప్పటివరకు ఆర్టికల్ 360ను ఉపయోగించలేదు. అందువల్ల దాని ప్రభావాన్ని విశ్లేషించేందుకు గత సందర్భాలు ఏవీ లేవు.

ఇదీ చూడండి: ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం అంతకుమించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.