ETV Bharat / business

చిన్న మొత్తాల్లో పొదుపా? ఈ పథకాలు మీ కోసమే..

చిన్న మొత్తాల పొదుపు పథకాలు.. వ్యక్తిగత పొదుపును ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవే ఈ స్కీమ్​లు. వీటిని ఎక్కువగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందువల్ల వీటిని సురక్షిత పెట్టుబడిగా పరిగణించవచ్చు. ఆర్థిక శాఖ వీటిపై త్రైమాసికాల వారీగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లాంటివి ఇందులో పాపులర్ పథకాలు. మరి ఇందులో ఏఏ పథకాలు ఎవరికి సరిపోతాయి? వాటిలో నిబంధనలు ఏమిటి? అనే వివరాలు మీ కోసం.

author img

By

Published : Apr 21, 2021, 6:40 PM IST

Benefits of saving in small amounts
చిన్న మొత్తాల్లో పొదుపుతో ప్రయోజనాలు

చిన్న మొత్తాల పొదుపు పథకాలు నెలవారీ ఆర్థిక క్రమశిక్షణను అలవడేలా చేస్తాయి. దీనితో పాటు వీటి వల్ల మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో వాయిదా పద్ధతిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి.. పొదుపు అనేది అలవాటు అవుతుంది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి పొదుపు సురక్షితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో పథకాలు కాంపౌండింగ్ ప్రభావంతో మంచి లాభాలను అందిస్తాయి. దీనిని రిటైర్మెంట్ ఫండ్​గా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏవి? వాటిలో కనీస పెట్టుబడి ఎంత? నిబంధనలు ఏమిటి? ఏవి ఎవరికి సరిపోతాయి అనే విషయాలను చూద్దాం.

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్

ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్సే ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇవి పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్లు.

ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.500 కాగా గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. ఇవి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్​తో వస్తాయి. అంటే ఈ సమయంలో విక్రయించటానికి వీలు ఉండదు.

వీటిపై రాబడి మార్కెట్ గమనానికి అనుగుణంగా ఉంటుంది. చారిత్రాత్మకంగా చూసుకున్నట్లయితే వీటిపై వార్షికంగా 12శాతం నుంచి 15 శాతం రాబడి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఈ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి మాత్రమే పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. మూలధన లాభాలకు పన్ను వర్తిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన

ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైన భేటీ బచావో, భేటీ పడావోలో భాగంగా తీసుకొచ్చిన పథకం ఇది. దీనిని 2015లో ప్రారంభించారు. ఇది ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. 2022 ఆర్థిక సంవత్సరానికి దీనిపై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇది ఫిక్స్​డ్​ ఇన్​కమ్ సేవింగ్స్ పథకం. రాబడిపై గ్యారంటీ ఉంటుంది.

ఆడపిల్ల వయస్సు 0-10 మధ్య ఉన్నప్పుడు ఆమె పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబానికి రెండు ఖాతాలు మాత్రమే తెరవవచ్చు. 15 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టుబడి కొనసాగించవచ్చు. 18 ఏళ్ల వయస్సులో కూతురు ఈ ఖాతాను తనపేరు మీదికి మార్చుకోవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి 18 ఏళ్ల వయస్సులో 50 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 సంవత్సరాలకు ఈ స్కీమ్ మెచ్యురిటీ ఉంటుంది.

దీనికి పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. పెట్టుబడితో పాటు రిటర్న్​లకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఖాతాదారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా లేక తక్కువ వయస్సులోనే మరణించినా.. మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడిని తీసుకోవచ్చు. ఇతర సందర్భాల్లో ప్రీ మెచ్యురిటీ విత్ డ్రా అనేది ఉండదు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)

ఇదొక పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్. నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ 1968లో దీనిని ప్రారంభించింది. పన్ను ప్రయోజనాలకు సంబంధించి చాలా పాపులర్ సాధనం ఇది. ఇందులో వార్షిక కనీస పెట్టుబడి రూ.500 కాగా.. గరిష్ఠ పెట్టుబడి రూ.1,50,000. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 7.1 శాతం కాగా వార్షికంగా కాంపౌండ్ అవుతుంది.

పెట్టుబడిదారులు ఒకటే ఖాతాను ప్రారంభించుకోవచ్చు. నెలసరి వాయిదా పద్ధతిలో లేక ఒకేసారి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. పెట్టుబడిని మరో 5 సంవత్సరాలు పొడగించుకోవచ్చు.

80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీ ఆదాయంతో పాటు పెట్టుబడి మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన

అసంఘటిత రంగంలో ఉన్న వారికి సామాజిక భద్రత పథకం ఇది. ఈ పథకంలో పింఛను మొత్తాన్ని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పింఛన్​ను ఎంపిక చేసుకోవచ్చు.

18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ఠ ప్రవేశ వయస్సు 40 ఏళ్లు. 60 ఏళ్ల వరకు ఇందులో మదింపు చేయాల్సి ఉంటుంది. నెలకు ఎంత మదింపు చేయాలన్నది వయస్సు, ఎంచుకున్న పింఛన్ ఆధారంగా నిర్ణయం అవుతుంది.

చిన్న వయస్సులో ఈ పథకంలో చేరితే తక్కువ మొత్తం నెలవారీ పెట్టుబడి ఉంటుంది. పొందాలనుకునే పింఛన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అయితే సంవత్సరానికి ఓ సారి ఏప్రిల్​లో మాత్రమే చేసుకోవాలి. ఈఎంఐ చెల్లించకుంటే ఆరు నెలల వరకు ఖాతా పని చేయదు. 12 నెలల తర్వాత ఖాతా డియాక్టివేట్ అవుతుంది. 24 నెలల అనంతరం ఖాతాను మూసివేస్తారు.

ఆదాయపు పన్ను చట్టం 80సీసీడీ(1) ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం అదనంగా రూ.50వేల వరకు మరింత మినహాయింపు తీసుకోవచ్చు.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్​ఎస్​సీ)

చిన్న మొత్తాల పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి రాబడికి గ్యారంటీ ఉంటుంది. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 6.8 శాతం ఉంది. వార్షికంగా వడ్డీ అసలుతో జమ(కాంపౌండింగ్) అవుతుంది.

దీనిలో పెట్టుబడి వ్యవధి 5 సంవత్సరాలు.. లాక్ ఇన్ పీరియడ్ కూడా ఐదేళ్లు. పెట్టుబడిదారులు మెచ్యురిటీ అనంతరం పెట్టుబడి, వడ్డీ కలిపి పొందుతారు. దీనిలో ప్రీ మెచ్యుర్డ్(మెచ్యురిటీ గడువు తీరకముందు) పెట్టుబడి ఉపసంహరణ చేసుకునేందుకు వీలు లేదు. పెట్టుబడిదారు చనిపోయినప్పుడు మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది. ఎన్ఎస్​సీని తనాఖా పెట్టి రుణం తీసుకోవచ్చు.

సెక్షన్ 80సీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీ ఆదాయంపై మాత్రం పన్ను ఉంటుంది.

పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్

ఇది బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లాంటిదే. డిపాజిట్​పై నాలుగు శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. ఆర్థిక సంవత్సరం చివర్లో వడ్డీ జమౌతుంది.

రూ.500 కనీస జమ మొత్తంతో ఖాతా తెరవవచ్చు. మైనర్ తరఫున సంరక్షకుడు ఖాతాను ప్రారంభించవచ్చు. రూ.500 కనీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. అయితే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ ప్రకారం రూ.10వేల వరకు మినహాయింపు తీసుకోవచ్చు.

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్

5 సంవత్సరాల పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ద్వారా తరచూ పొదుపు చేసుకోవచ్చు. త్రైమాసికం వారీగా వడ్డీ అసలుకు జమ అవుతుంది. నెలవారీగా పొదుపు చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. 5.8 శాతం వడ్డీ రేటు ఉంది. రూ.10 నుంచి ఇందులో పెట్టుబడి ప్రారంభించుకోవచ్చు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. సంరక్షకుడితో కలిసి మైనర్ ఖాతాను నిర్వహించుకోవచ్చు. మైనర్ల తరఫున వారి తల్లిదండ్రులు దీన్ని ప్రారంభించవచ్చు.

మెచ్యురిటీ గడువు తీరకముందు విత్ డ్రా చేసుకోరాదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రీ మెచ్యూర్డ్ విత్ డ్రా చేసుకోవచ్చు. కాకుంటే దీనిని ప్రతి వందకు పెనాల్టీ రూ.1 విధిస్తారు. కనీస లాక్ ఇన్ పీరియడ్ 3 నెలల. మూడు నెలల కంటే ముందు డిపాజిట్​ను ఉపసంహరించుకుంటే ఎలాంటి వడ్డీ రాదు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్

ఇది తక్కువ రిస్కుతో కూడిన పెట్టుబడి పథకం. నెలవారీ ఆదాయాన్ని ఇది అందిస్తుంది. ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ రేటు దీనిపై ఉంది. ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం వీటిపై వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. ఈ పథకానికి ఐదు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మెచ్యురిటీ అనంతరం డిపాజిటర్ పొందే మొత్తాన్ని మళ్లీ మదుపు చేయొచ్చు.

ఇందులో కనీసంగా రూ.1500 కాగా గరిష్ఠంగా రూ. 4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు ఖాతాను మార్చుకునే వీలు కూడా ఉంటుంది. సంవత్సరం తరువాత ప్రీ మెచ్యుర్డ్ విత్ డ్రా చేసుకోవచ్చు.. ఇందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్

దీన్ని కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వడ్డీ చెల్లింపు రూపంలో రెగ్యులర్ ఆదాయాన్ని ఇస్తుంది. త్రైమాసికాల వారీగా వడ్డీ గణన జరిగిన అనంతరం ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.

కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు ఇందులో మదుపు చేసుకోవచ్చు. ఈ పథకానికి లాక్ ఇన్ పీరియడ్ 5 సంవత్సరాలు. మరో మూడు సంవత్సరాలు ఈ పథకంలో కొనసాగే వీలు కూడా ఉంటుంది.

సెక్షన్ 80సీ ప్రకారం.. ఈ పథకంలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను వర్తిస్తాయి. వడ్డీ పై మాత్రం పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం రూ50వేలు దాటినట్లైతే టీడీఎస్(ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్

ఇది ఉద్యోగ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన పథకం. ప్రభుత్వ, ప్రైవేట్ అసంఘటిత రంగంలో పని చేసే వారికోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత రెగ్యులర్ ఆదాయం ఉండాలనుకునే వారికి ఇది సరిపోతుంది. వీటిలో రిస్కు కూడా చాలా తక్కువగా ఉంటుంది.

ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. రిటైర్మెంట్ అనంతరం కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. మిగతా మొత్తం పింఛను రూపంలో వస్తుంది.

ఇందులో రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. అదనంగా రూ.50వేల పెట్టుబడి వరకు సెక్షన్ 80సీసీడీ ప్రకారం పన్ను తగ్గింపు ఉంటుంది.

ఇవీ చదవండి:

రిస్క్ తక్కువ ఉండే ఉత్తమ పెట్టుబడులు ఇవే!

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు స‌రైన‌ పొదుపు ప‌థ‌కాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.