ETV Bharat / business

సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!

కోటీశ్వరులు కావాలని కోరుకోని వారెవరు చెప్పండి.. ఇలా ఆలోచించే వారిలో తమ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. కారణం… అందరూ అంత క్రమశిక్షణతో తమ ప్రణాళికలను అమలు చేయకపోవడమే. కాలం, అవకాశం ఒకసారి చేజారితే మళ్లీ తిరిగి రావు. పొదుపు, మదుపు విషయం కూడా అంతే. ఒక్కసారి పొరపాటు చేశామా? అంతే…

సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!
author img

By

Published : Aug 31, 2019, 6:21 AM IST

Updated : Sep 28, 2019, 10:48 PM IST

డబ్బు సంపాదించాలి.. విలాసవంతమైన జీవితం అనుభవించాలి అని అందరూ అనుకుంటారు. వాటికి లక్ష్యాలు కూడా నిర్దేశించుకుంటారు. అయితే ఆ స్థాయికి చేరుకోవడంలో విఫలమవుతుంటారు.

ప్రస్తుతం ఎవరిని కదిలించినా వేలకు వేల జీతాన్ని ఆర్జిస్తున్నామని గర్వంగా చెబుతుంటారు. కానీ, నెలాఖరునాటికి ఎంత మొత్తం చేతిలో ఉంటుంది అని అడిగితే మాత్రం అయోమయంగానే చూస్తారు. జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఖర్చుల వల్ల ఎంతోకొంత అప్పు చేస్తేగానీ బయటపడని పరిస్థితి ఏర్పడుతోంది.

అసలు సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో మనం చేసే పొరపాట్లేమిటి? ఎందుకు మనం ధనవంతులుగా మారలేకపోతున్నాం?

ప్రణాళిక లేకపోవడం:

ఎక్కడికెళ్లాలో తెలియకుండా ప్రయాణం ప్రారంభించం. ఆర్థిక విషయాల్లో కూడా అంతే. ఏం సాధించాలో తెలియకుండా వూరికే పొదుపు, పెట్టుబడుల వల్ల ఫలితం ఉండదు. సరైన ప్రణాళిక లేకపోతే కోటీశ్వరులు కావాలనుకోవడం తీరని కలగానే మిగిలిపోతుంది. ప్రణాళిక వేసుకోవడంలో విఫలం కావడం అంటే… లక్ష్య సాధనకు కూడా దూరం కావడమే.

అత్యవసర నిధి:

సహజంగా ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తం అత్యవసర నిధిగా అందుబాటులో పెట్టుకోవాలని నిపుణులు సూచించే మాట. రోజువారీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఈ ఏర్పాటు ఉండాలని చెప్పేది. కానీ, చాలామంది దగ్గర ఒక నెల సరిపడా మొత్తం కూడా ఉండదు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే… అత్యవసరాల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలి. అందుకే, మీ పొదుపును ముందుగా దీనితోనే ప్రారంభించండి. సాధ్యమైనంత తొందరగా అత్యవసర నిధిని సిద్ధం చేసుకొని, పెట్టుబడులపై దృష్టి సారించండి.

ఆలస్యం చేస్తే:

ఆలస్యం అమృతం విషం… అన్నారు పెద్దలు. ఏదైనా సరే… సమయానికి జరిగిపోతేనే దానికి ఓ విలువ. అందుకే, ఆర్జించడం ప్రారంభించగానే పొదుపు మదుపు కూడా ఆరంభించాలి. సంపాదన తక్కువగా ఉంది అంటే… పిండి కొలదీ రొట్టె అన్నట్లు… మీ సంపాదనను బట్టే పొదుపు చేయండి. అప్పుడే మన లక్ష్యం తొందరగా ప్రారంభించడానికి వీలవుతుంది.

23 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.3045 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తూ వెళ్లాడనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో అతని దగ్గర రూ.కోటి జమ అవుతుంది. అదే అన్ని పరిస్థితులూ బాగుండి… 17శాతం రాబడి అంచనాతో మదుపు చేస్తే నెలకు రూ.2083 చాలు. ఆలస్యం చేస్తున్న కొద్దీ మనం పెట్టుబడి పెట్టే మొత్తం పెరుగుతుంది. కానీ, అనుకున్న ఫలితాన్ని మాత్రం చేరుకోలేం.

ఆచరణలో చూపాలి:

‘డబ్బు ఎక్కడ మిగులుతుంది’… ఉన్నదంతా ఖర్చులకే పోతోంది… ఏమాత్రం ఆశాజనకంగా లేదు… మనం సంపాదించేది ఎంత? ఇలాంటి మాటలు చాలామంది నోట వింటుంటాం. నెలకు రూ.లక్ష వస్తున్నా… నెలకు రూ.12వేలు వస్తున్నా… ఎవరికి తగ్గ ఖర్చులు… వారి జీవన శైలి వారికి ఉంటుంది. సంపాదనను బట్టి వ్యక్తుల అలవాట్లూ ఉంటాయి. సాధ్యం కాదు అనే సాకులు చూపడం మానేయండి. అనుమానాలు లేకుండా మీ పొదుపు, పెట్టుబడి ప్రణాళికలను ఆచరణలో పెట్టండి. మీ శక్తియుక్తులను ఉపయోగించుకొని సంపాదనను పెంచుకునే ప్రయత్నం చేయాలి.

అన్నీ ఒకే చోటనా?

పెట్టుబడుల్లో గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం వైవిధ్యం. చాలామంది చేసే పొరపాటేమిటంటే… పెట్టుబడికి కేటాయించే మొత్తాన్ని అంతా ఒకే పథకానికి కేటాయించడం. దీనివల్ల నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఆర్థిక స్తోమత, వయసు, నష్టభయం భరించే సామర్థ్యం, అనుకున్న లక్ష్యం, ఉన్న సమయం ఆధారంగా ఎక్కడ మదుపు చేయాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే… అధిక రాబడి సాధించి, తొందరగా ధనవంతులు అవుతారు.

భవిష్యత్తులో ఏదో జరగవచ్చనీ, హఠాత్తుగా ధనవంతులం అయిపోతామని కలలు కనడం ఎంత వరకు సబబో చెప్పక్కర్లేదు. అందుకే, నేడు మనం ఉన్న పరిస్థితి ఏమిటి? దీనికన్నా ఉన్నతంగా జీవించడానికి ఏం చేయాలి అనే వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే చాలు… అన్నీ మనకే అర్థం అవుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని లోకంలో… మన గురించి మనం కాసేపు ఆలోచించుకుంటే పోయేదేముంది! అయితే ధనవంతులం అవుతాం! అంతే కదా!

New Delhi, Aug 30 (ANI): CPI(M) General Secretary Sitaram Yechury on Friday arrived at Delhi airport after visiting Jammu and Kashmir and meeting his party leader Yousuf Tarigami. Recently, the Supreme Court allowed him to visit the valley and meet his party leader. While speaking to mediapersons, Yechury said, "We have visited the place as per the SC's order. We have talked with comrade Tarigami. The doctors were also called. We will submit an affidavit in the SC describing his medical condition as the SC has ordered for an affidavit. We don't think the situation is same in Kashmir as the government claiming.
Last Updated : Sep 28, 2019, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.